Lagaan : 20 ఏళ్ల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకానిక్ ఫిల్మ్స్..

2001 జూన్ 15 వ తేదీ ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఓ స్పెషల్ మెమరీగా నిలిచిపోయింది.. రెండు ఐకానిక్ ఫిల్మ్స్ భారతీయ చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి..

Lagaan : 20 ఏళ్ల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన ఐకానిక్ ఫిల్మ్స్..

Lagaan

Updated On : June 16, 2021 / 12:36 PM IST

Lagaan: 2001 జూన్ 15 వ తేదీ, ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఓ స్పెషల్ మెమరీగా నిలిచిపోయింది. రెండు ఐకానిక్ ఫిల్మ్స్ భారతీయ చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి.. ఈ రెండు సినిమాలు సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయ్యాయి..

ఆమిర్ ఖాన్, గ్రేసీ సింగ్ జంటగా.. అశేతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఫిలిం.. ‘లగాన్’ (వన్స్ అపన్ ఎ టైం ఇన్ ఇండియా).. బ్రిటీష్ వారి బానిసత్వం నుండి సాత్వంత్ర్యం కోరుకునే భారతీయులు వారితో క్రికెట్ ఆడి గెలవడం అనే పాయింట్‌తో తెరకెక్కించిన ఎమోషనల్ మూవీ ‘లగాన్’.. నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు అద్భతం.. ఆమీర్ ఖాన్, అశుతోష్ ప్రతిష్టాత్మక ఆస్కార్ కార్యక్రమంలో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి లాస్ ఏంజెల్స్ వెళ్లడం విశేషం. ఎన్నేళ్లైనా భారతీయ సినిమా చరిత్రలో ‘లగాన్’ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుంది.

సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’.. ఈ సినిమా ప్రేక్షకుల మనసులు దోచింది. ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రేమకథా చిత్రాల్లో ‘గదర్’ మూవీది స్పెషల్ ప్లేస్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.