అక్షయ్ అభిమానులకు కన్నుల పండగే.. 2021లో ఏకంగా 7 సినిమాల రిలీజ్

Akshay Kumar: గతేడాది (2020)లో కేవలం ఒకే ఒక్క సినిమా లక్ష్మీతో అలరించిన అక్షయ్ కుమార్.. 2021లో ఏకంగా 7సినిమాలతో అలరించనున్నాడు. లాక్‌డౌన్ రిలాక్స్ చేసినప్పటి నుంచి ఖాళీ లేకుండా వరుస సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఓటీటీ ప్లాట్ ఫాంలలో మాత్రమే కాకుండా థియేటర్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు.
బెల్ బాటం:
రంజిత్ ఎమ్ తివారీ డైరక్షన్‌లో రాబోతుంది థ్రిల్లర్ మూవీ బెల్ బాటం. RAW ఏజెంట్ గా కనిపిస్తూ లీడ్ రోల్ లో అలరించనున్నాడు అక్షయ్. స్కాట్ లాండ్ లోని హైలాండ్స్ కొన్ని షాట్స్ చేసేశారు. 80వ దశకంలో ఉన్న ట్రెండ్ బాల్ బాటంతో హీరో కనిపిస్తుండటం టైటిల్ కు సెట్ అవుతుంది. అసీమ్ ఆరోరా, పర్వీజ్ షేక్ రాసిన సినిమాలో వాణీ కపూర్, హుమా ఖురేశీ, లారా దత్తా భూపతిలు లీడ్ రోల్స్ లో కనిపించనుండగా సినిమా 2021 ఏప్రిల్ 2న రిలీజ్ అవనుందట.
సూర్యవంశీ
2020ల్లోనే రిలీజ్ కావాల్సిన సినిమా సూర్యవంశీ. రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ డ్రామా మరి కొద్ది నెలల్లో రిలీజ్ అవుతుందట. అక్షయ్ కుమార్ యాంటీ టెర్రరిజం స్క్కావడ్ డీసీపీ వీర్‌గా కనిపిస్తుండగా కత్రినా కైఫ్ అతనికి జోడీగా నటించనుంది. ఇందులో మరికొన్ని ప్రధానపాత్రల్లో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ కనిపిస్తారు. మార్చి 2021లో రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు.
అత్రంగి రే
అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, ధనుష్ లీడ్ రోల్స్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్ చేస్తుండగా సినిమా కథను నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్ హిమాన్షు శర్మ అందించారు. 2021లోనే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్.
పృథ్వీ రాజ్:
2020లో రిలీజ్ కావాల్సిన మరో సినిమా పృథ్వీ రాజ్. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించనున్న యాక్షన్ డ్రామాకు చంద్రప్రకాశ్ ద్వివేది డైరక్షన్ చేయనున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించి కనువిందు చేయనుండగా 2021లోనే రిలీజ్ చేస్తున్నారు.
రక్షాబంధన్:
ట్వీట్ ద్వారా స్వయంగా అక్షయ్ ప్రకటించిన భారీ బడ్జెట్ సినిమా రక్షా బంధన్. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం గురించి చెప్పే సినిమా. నా కెరీర్ లో చేస్తున్న సినిమాల్లో గుండెకు హత్తుకుపోయే కథాంశంతో రూపుదిద్దుకొంటున్న సినిమా. దీనిని 2021 నవంబర్ 5న రిలీజ్ కు షెడ్యూల్ అయింది.
రామ్ సేథు:
బాలీవుడ్ నిర్మాణ సారథ్యంలో రానున్న 2021మైథలాజికల్ సినిమా రామ్ సేథు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్‌లో అభిషేక్ శర్మ డైరక్షన్, అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సినిమా నిర్మాణం జరగనుంది. రామ భగవాన్ గురించి చెప్తూ సినిమా కథ జరుగుతుంది.
బచ్చన్ పాండే
జనవరి 2021లో రిలీజ్ కావాల్సి ఉన్న బచ్చన్ పాండే సినిమా కొద్ది నెలల గ్యాప్ తర్వాత విడుదల చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తో పాటు కృతి సనన్ లీడ్ రోల్స్ లో కనిపిస్తున్న సినిమా 2014లో వచ్చిన వీరమ్ కు రీమేక్.