7-year-old fashion designer : 7 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్.. అమ్మాయిల దుస్తులు అద్భుతంగా డిజైన్ చేసేస్తున్నాడు
వయసు 7 ఏళ్లు.. అంతర్జాతీయ స్ధాయిలో దుస్తులు డిజైన్ చేసి విక్రయించేస్తున్నాడు. "పిట్ట కొంచెం కూత ఘనం" అంటే ఇదేనేమో. అలెగ్జాండర్ అనే బాలుడి టాలెంట్ చూస్తే మీరు ఔరా అంటారు.

7-year-old fashion designer
7-year-old fashion designer : బాలుడి వయసు జస్ట్ 7 ఏళ్లు. బట్టలు డిజైన్ చేయడమే కాదు.. సెలబ్రిటీలకు డిజైన్ చేయడంలో పేరు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల మంది యూజర్లు ఉన్న మాక్స్ అలెగ్జాండర్ అనే బాలుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో తను డిజైన్ చేసిన దుస్తులు విక్రయిస్తున్నాడు.
అలెగ్జాండర్‌కి 4 సంవత్సరాల వయసులోనే డ్రస్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదట. అతని తల్లి షెర్రీ మాడిసన్ కార్డ్ బోర్డ్ ఆర్టిస్ట్.. డిజైనర్. కొడుకుకి దుస్తులు డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తిని గమనించి ఒక ప్రొఫెషనల్ తో అలెగ్జాండర్‌కి దుస్తులు కుట్టడం నేర్పించారు. 5 సంవత్సరాల వయసులో అతను మొట్ట మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించాడు.
ఆ ప్రదర్శన ద్వారా అలెగ్జాండర్ సంపాదించిన డబ్బులు పెట్టి తల్లి రెండు కుట్టు మిషన్లు కొనుగోలు చేసిందట. అలా దుస్తులు డిజైన్ చేయడం మొదలు పెట్టిన అలెగ్జాండర్ చాలా త్వరగా వందకు పైగా డిజైన్లు చేసేసాడట. వాటిని ఇంటర్నేషనల్ లెవెల్‌లో విక్రయించాడు. అమెరికన్ నటి షారన్ స్టోన్ కోసం కూడా ఒక జాకెట్‌ను డిజైన్ చేశాడు అలెగ్జాండర్.
kind heart : బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి చలించి పోయిన ఐపీఎస్ ఆఫీసర్.. ఏం చేశారంటే?
వీకెండ్స్‌లోనూ.. హాలీడేస్‌లోనూ డిజైన్లు చేస్తుంటాడట.. అలాగే సముద్రం.. ప్రకృతి నుంచి ప్రేరణ పొంది అతను దుస్తులు డిజైన్ చేస్తాడట. అయితే అలెగ్జాండర్ డిజైన్ చేసేవి అన్నీ మహిళల దుస్తులే. మొత్తానికి పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు 7 ఏళ్ల వయసులో ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ డిజైనర్‌గా అలెగ్జాండర్ ఎదగడం అంటే మాటలా? మెచ్చుకుని తీరాల్సిందే.
View this post on Instagram