Ira Khan : బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు.. వీడియో వైరల్..

నపూర్ వ్యక్తిత్వం బాగా నచ్చడంతో అతడితో ప్రేమాయణం స్టార్ట్ చేసింది ఐరా ఖాన్.. ఆ తర్వాత కొద్ది రోజులకే తనతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది..

Ira Khan : బాయ్‌ఫ్రెండ్‌తో ఆమిర్ ఖాన్ కూతురు.. వీడియో వైరల్..

Ira Khan

Updated On : June 3, 2021 / 2:55 PM IST

Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డాటర్ ఐరా ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా స్టార్ కిడ్‌గా, తన పర్సనల్ విషయాలతో  సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.. గతకొంత కాలంగా తండ్రి ఆమిర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో పాప పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది..

అంతకుముందు మిషాల్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది ఐరా. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. లాక్‌డౌన్ టైంలో తండ్రి కోచ్ నుపూర్ తనకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అప్పుడే ఐరా ప్రేమకు బీజం పడింది.

నపూర్ వ్యక్తిత్వం బాగా నచ్చడంతో అతడితో ప్రేమాయణం స్టార్ట్ చేసింది ఐరా ఖాన్. ఆ తర్వాత కొద్ది రోజులకే తనతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇక అప్పటినుండి ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కలిసున్న పిక్స్ షేర్ చేస్తూ రచ్చ లేపుతోంది. రీసెంట్‌గా నపూర్‌తో గడిపిన బ్యూటిఫుల్ మెమరీస్ తాలుకు ఫొటోలన్నిటినీ వీడియో రూపంలో షేర్ చెయ్యగా తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)