Actor Sohel : సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..

సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా.. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు..

Actor Sohel : సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..

Actor Sohel Helps To Cine Workers

Updated On : June 15, 2021 / 12:31 PM IST

Actor Sohel: సీరియల్ నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్నారు పాపులర్ నటుడు సోహైల్. యాంగ్రీ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అతను చూపించిన ఆటతీరుకు లక్షలాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికీ ఆయనను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ అయన అభిమానులు సోహైల్ చేసే ప్రతి పోస్ట్‌‌ను లైక్, కామెంట్స్ చేస్తూ ఉంటారు..

బిగ్ బాస్‌లో టాప్ 3 లో ఒకరిగా ఉన్న సోహైల్, మెగా స్టార్ చిరంజీవి ప్రశంశలు పొందారు.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన తరువాత ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్‌గా మారుతున్నారు.. సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. అంతేకాకుండా మరిన్ని సేవ కార్యక్రమాలు చేసే విధంగా ప్రయత్నిస్తామని ఆయన భరోసా ఇచ్చారు..

Syed Sohel : లాక్‌డౌన్ టైమ్‌లో ఎంతో మందికి సేవ చేస్తున్న సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్..

ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సోహిలియన్స్‌గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఈ సంస్థ ద్వారా సోహైల్ ఇప్పటికే 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని అన్నారు. గుండె సంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తాం.. దానికి మీ ఆశీర్వాదాలు కావాలి.. అన్నారు.. ఈ సంస్థ ఇంత బాగా పని చేయడానికి, ముందుకు వెళ్ళడానికి సోహిలియన్స్ ఎంతో కష్టపడుతున్నారని అన్నారు..

Actor Sohel