Pooja Hegde : ఆ రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న పూజా పాప..

కెరీర్ స్టార్టింగ్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా.. ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా తన టైమ్ కోసం వెయిట్ చేసింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే.. దెబ్బకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో అందరు స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది..

Pooja Hegde : ఆ రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకున్న పూజా పాప..

Pooja Hegde

Updated On : April 23, 2021 / 4:46 PM IST

Pooja Hegde: కెరీర్ స్టార్టింగ్‌లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా.. ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వకుండా తన టైమ్ కోసం వెయిట్ చేసింది హాట్ బ్యూటీ పూజా హెగ్డే.. దెబ్బకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో అందరు స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా అంతలా పెరిగిపోయారు సోషల్ మీడియాలో..

Radhe Shyam

తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్ బాబుతో ‘మహర్షి’ చేసింది. బన్నీతో ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. వరుస హిట్లతో ఆడియెన్స్‌కి ఇంకా క్లోజ్ అయ్యిందీ బుట్టబొమ్మ. సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇచ్చే ఈ ముద్దుగమ్మ ఇప్పుడు కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్‌తో టాప్ త్రీ ప్లేస్‌ని కొట్టేసింది.

Most Eligible Bachelor

 

మొన్న మొన్నటి వరకూ సౌత్‌లో సమంత, రష్మిక, తమన్నా ఈ రేంజ్ ఫాలోయింగ్‌తో ముందుంటే.. ఇప్పుడు తమన్నాని దాటేసి థర్డ్ ప్లేస్‌లోకి వచ్చేసింది పూజా హెగ్డే. ఏ షూట్‌కి వెళ్లినా, సెట్‌కి వెళ్లినా, అసలు షూటింగ్ లేకుండా ఇంట్లో ఉన్నా, లేక డిన్నర్ కో, రెస్టారెంట్‌కో వెళ్లినా.. ఇలా ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తుంది పూజా హెగ్డే.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

తెలుగు, హిందీ, తమిళ్ ఇలా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమాలతో దున్నేస్తున్న పూజా హెగ్డే, వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది. ఏమాత్రం యాటిట్యూడ్ చూపించకుండా సింపుల్‌గా ఉండే తన నేచర్‌తోనే కోట్లలో ఆడియెన్స్‌ని సంపాదించుకుంటోంది ఈ పొడుగు కాళ్ల భామ. ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ తో పాటు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది పూజా పాప..

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)