Richa Gangopadhyay : హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్‌కు మగబిడ్డ పుట్టాడు..

నటి రిచా గంగోపాధ్యాయ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది..

Richa Gangopadhyay : హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్‌కు మగబిడ్డ పుట్టాడు..

Richa Gangopadhyay

Updated On : June 5, 2021 / 3:34 PM IST

Richa Gangopadhyay: నటి రిచా గంగోపాధ్యాయ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. తల్లి కావడం అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంత మధురమైనది అంటూ బాబు ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.. మే 27న తమకు బాబు పుట్టాడని, చిన్నారికి లూకా షాన్ లాంగెల్లా (Luca Shaan Langella) అనే పేరు పెట్టామని తెలిపింది..

రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ్.. తర్వాత ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.. సినిమాలు పక్కన పెట్టి హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లిన రిచా సహ విద్యార్థి జో  లాంగెల్లా (Joe Langella) తో ప్రేమలో పడింది..

తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఇటీవల తాను గర్భవతిగా ఉన్నానంటూ బేబీబంప్ పిక్ పోస్ట్ చేసింది. జూన్‌లో తమ ఫస్ట్ చైల్డ్‌ బేబీ లాంగెల్లాకు వెల్‌కమ్ చెప్పబోతున్నామని, ఆ మధురక్షణాలను అనుభవించడానికి వెయిట్ చెయ్యలేకపోతున్నానంటూ.. భర్త జో లాంగెల్లా తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటో షేర్ చేసింది.. కట్ చేస్తే లిటిల్ లూకా షాన్ లాంగెల్లా మే నెలాఖరులోనే పుట్టేశాడు..

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)