Actress Samantha Starts New Business
Samantha: స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ..పెళ్లి తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ.. ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. ఇటీవలే ‘ది ఫ్యామిలీ మెన్ 2’ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి, రాజీ రోల్‌తో అదరగొట్టేశారు.
Samantha Akkineni : కోటి 70 లక్షల ఫాలోవర్స్‌తో సమంత రికార్డ్..!
ఇప్పటికే ‘సాకీ’ అనే ఫ్యాషన్ బిజినెస్‌తో పాటు, ‘ఏకం’ (Ekam-Early Learning Centre) అనే ప్రీ-స్కూళ్లను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రభావం లేకపోతే ఈ పాటికే సామ్ ప్రీ- స్కూల్ స్టార్ట్ అయ్యుండేది. ఇప్పుడామె కొత్త జర్నీ స్టార్ చేయనున్నారు. ఇంతకీ సమంత ప్రారంభించే ఆ కొత్త ప్రయాణమేంటో తెలుసా?..
Samantha Akkineni : సమంత అక్కినేని న్యూ జర్నీ.. జూబ్లీహిల్స్‌లో ప్రారంభం!
జ్యువెల్లరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారట సమంత. హైదరాబాద్‌తో పాటు మిగతా మెట్రోపాలిటన్ సిటీస్‌లోనూ సామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం అన్‌కాంప్రమైజ్డ్ స్టైలిష్ మూవీ మేకర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ మూవీలో టైటిల్ రోల్ చేస్తున్నారు సామ్.