సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతులు..

కరోనా దెబ్బకు ప్రపంచమే ఆగిపోయింది. గుడులు మూసుకున్నాయ్.. బుడులు మూసుకున్నాయ్.. కార్పోరేట్ కంపెనీలు మూసుకున్నాయ్.. ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావలసి ఉండగా.. అటువంటి పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు. బుడుల్లేవ్.. బడుల్లో చదువుల్లేవ్, పుస్తకాల్లేవ్.. పాఠాల్లేవ్.. పాఠాలు చెప్పే అయిఓర్లు కూడా లేరు.
తమ పిల్లల చదువులు ఇబ్బందుల్లో పడిపోతాయనే ఆందోళనలో తల్లిదండ్రులు.. విద్యాసంవత్సరం త్వరగా మొదలు కాకపోతే నిర్ణీత సమయంలో పాఠాలు ఎలా పూర్తి చెయ్యాలనే ఆందోళనలో స్కూళ్లు, టీచర్లు ఉన్నారు. పీడ దినాలుగా మారిపోయిన కరోనా కాలం ఎప్పుడు అయిపోతుందా? అని ఎదురుచూస్తున్నారు. సీన్ కట్ చేస్తే..
కరోనాతో దేశవ్యాప్తంగా వాయిదా పడిన విద్యా సంవత్సరంని సెప్టెంబర్ 15నుంచి ప్రారంభించాలని కేంద్రం భావిస్తుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరంను సెప్టెంబర్ 15నుంచి ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను జారీ చేసింది.
ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Read:30% సిలబస్ తగ్గింపు… కొత్త క్యాలెండర్ రూపొందిస్తున్న విద్యా శాఖ