Ajay Devgn : హిందీలోకి నరేష్ ‘నాంది’..

బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘నాంది’ హిందీలో రీమేక్ కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు..

Ajay Devgn : హిందీలోకి నరేష్ ‘నాంది’..

Ajay Devgn Collaborate With Dil Raju For The Hindi Remake Of The Telugu Hit Naandhi

Updated On : June 25, 2021 / 11:19 AM IST

Ajay Devgn: రోజురోజుకీ తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా హిందీలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. ‘పోకిరి’ (వాంటెడ్), ‘రెడీ’ (Ready), ‘కిక్’ (Kick), ‘అర్జున్ రెడ్డి’ (కబీర్ సింగ్), ‘జెర్సీ’ (Jersey).. ఇలా తెలుగులో విజయం సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్..

Naandhi

ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన ‘నాంది’ హిందీకెళ్తోంది. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరించిన ‘అల్లరి’ నరేష్.. తనలోని నటుణ్ణి బయటకు తీసే విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా నిరూపించుకోవాలని ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. నరేష్ నటనకు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫిదా అయ్యారు. యూనిట్ పడ్డ కష్టానికి ఫలితం అందరికీ తెలిసిందే.

తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నాంది’.. డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోనూ మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘నాంది’ హిందీలో రీమేక్ కాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అజయ్ దేవ్‌గణ్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. డైరెక్టర్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.