Allu Arjun: వెండితెరపై అల్లు అర్హ.. ప్రయత్నాల్లో బడా నిర్మాత!
సోషల్ మీడియాలో సెలబ్రిటీలకే కాదు వారి పిల్లలకు కూడా యమా క్రేజే ఉంటుంది. తమ అభిమాన తారలతో సమానంగా అభిమానులు వారిని ప్రేమిస్తుంటారు. నిజానికి ఇది చాలాకాలంగా ఉన్నదే కాగా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని మరింత చేరువైంది. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

Allu Arjun
Allu Arjun: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకే కాదు వారి పిల్లలకు కూడా యమా క్రేజే ఉంటుంది. తమ అభిమాన తారలతో సమానంగా అభిమానులు వారిని ప్రేమిస్తుంటారు. నిజానికి ఇది చాలాకాలంగా ఉన్నదే కాగా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని మరింత చేరువైంది. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి చేసే అల్లరి వీడియోలను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తే అభిమానులు తెగ మురిసిపోతుంటారు.
కాగా, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి మరో నటి రాబోతుంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టీ అర్హ. ఇప్పటి వరకు తన క్యూట్ మాటలతో అభిమానులకు ఆకట్టుకున్న అర్హను త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అర్హను వెండితెరమీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడట. నూతన దర్శకుడు సురేష్ చిన్న పిల్లల చుట్టూ తిరిగే ఓ కథ చెప్పగా దిల్ రాజు ప్రయోగం చేసేందుకు సిద్దమయ్యాడట. ఇది పూర్తిగా పిల్లల కాన్సెప్ట్ తో సాగే సినిమాగా తెలుస్తుంది.
ఇక ఇందులో అల్లు అర్హను లీడ్ రోల్ లో తీసుకోవాలనుకుంటున్న దిల్ రాజు ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉండగా దాదాపుగా ఇది ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా అర్హ ఇప్పటికే అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించి అలరించగా.. ‘అంజలి అంజలి’ వీడియో సాంగ్ ను కూడా రీక్రియేట్ చేసి విడుదల చేసిన వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి.