Viran Muttamsetty: హీరోగా బన్నీ కజిన్.. ‘బతుకు బస్టాండ్’ అంటున్న విరాన్..

సినీ, రాజకీయ మరియు వ్యాపార రంగాల్లో వారసులు ఎక్కువగా కనిపిస్తుంటారు. తండ్రి, తాతల నుండి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. బ్యాగ్రౌండ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది కానీ ఎవరికివారే తమ సొంత టాలెంట్‌తోనే తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎందరో నటులు వారసులు సొంత టాలెంట్‌తో స్టార్స్‌గా రాణిస్తున్నారు. 

Viran Muttamsetty: హీరోగా బన్నీ కజిన్.. ‘బతుకు బస్టాండ్’ అంటున్న విరాన్..

Viran Muttamsetty

Updated On : March 13, 2021 / 8:21 PM IST

Viran Muttamsetty: సినీ, రాజకీయ మరియు వ్యాపార రంగాల్లో వారసులు ఎక్కువగా కనిపిస్తుంటారు. తండ్రి, తాతల నుండి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తుంటారు. బ్యాగ్రౌండ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది కానీ ఎవరికివారే తమ సొంత టాలెంట్‌తోనే తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎందరో నటులు వారసులు సొంత టాలెంట్‌తో స్టార్స్‌గా రాణిస్తున్నారు.

Mega Family

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నాగబాబు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ సినిమాల్లోకి ఎంటర్ అయ్యి తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య గారి వారసుడిగా అల్లు అరవింద్ నటుడిగా కనిపించింది తక్కువే అయినా స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, తెలుగులో తొలి ఓటీటీని స్థాపించి ఫాదర్ ఆఫ్ ఓటీటీగా కొనసాగుతున్నారు. ఆయన బాటలోనే పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో నిర్మాతగా మారారు.

Viran Muttamsetty

ఈ ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. బన్నీ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఐవీఆర్ దర్శకత్వంలో కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. విరాన్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్ వదిలారు. చూసిన వారంతా కుర్రాడికి హీరో పోలికలున్నాయి. తప్పకుండా మంచి యాక్టర్ అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 11న విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న ‘బతుకు బస్టాండ్’ మూవీ రిలీజ్ కానుంది.

 

Viran Muttamsetty