Amit Shah : నిజాం వెయ్యిమందిని ఊచకోత కోసిన స్థలంలో అమిత్ షా బహిరంగ సభ
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రి చెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారని చరిత్ర చెబుతోంది.

Amit Shah
- ఖరారైన అమిత్ షా తెలంగాణ పర్యటన
- సెప్టెంబర్ 17న రాక
- నిర్మల్ లో భారీ బహిరంగ సభ
Amit Shah : తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఈ విషయాన్ని కన్ ఫామ్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా పాటిస్తోంది బీజేపీ. ఆరోజు తెలంగాణ అంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. నిజాం అరాచక పాలన నుంచి తెలంగాణ స్వేచ్ఛ పొందిన రోజున సంబరాలు చేసుకునేలా షెడ్యూల్ రూపొందించింది.
Breaking : ఈడీ విచారణకు కెల్విన్ : నందుపై ప్రశ్నల వర్షం
సెప్టెంబర్ 17 నాడే అమిత్ షా తెలంగాణకు రానున్నారు. నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గర బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలో అమిత్ షా తో పాటు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఇతర నేతలు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
Death Penalty Cases : 40 మరణశిక్ష కేసులపై సుప్రీం విచారణ ప్రారంభం
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రి చెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారని చరిత్ర చెబుతోంది. అరాచకానికి, రాక్షసత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం దగ్గరే తెలంగాణ స్వేచ్ఛా సంబురాలు నిర్వహించాలని బీజేపీ డిసైడైంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలో సెప్టెంబర్ 17ను హైలైట్ చేస్తూ వస్తున్నారు బండి సంజయ్. అటు ప్రజా ఆశీర్వాదయాత్రలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ సర్కారు అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించడం లేదని విమర్శిస్తూ వస్తున్నారు. ఐతే… గత ప్రభుత్వం ఆనవాయితీనే కొనసాగిస్తున్నామని గులాబీ ప్రభుత్వం చెబుతోంది.