తన పోస్టల్ స్టాంప్ చూసి ఎమోషనల్ అయిన అనసూయ

తన పోస్టల్ స్టాంప్ చూసి ఎమోషనల్ అయిన అనసూయ

Updated On : February 12, 2021 / 9:32 PM IST

Anchor Anasuya: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె అంతలా ఉద్వేగానికి లోనవడానికి గల కారణం ఏంటంటే..

‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ అనసూయను పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. తన ఫొటోకి ఎర్రకోటని కూడా యాడ్ చేయడంతో అనసూయ ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ మెమరబుల్ మూమెంట్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నారామె.

‘‘జీవితంలో ఇంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది.. సొంత పోస్టల్ స్టాంప్స్.. దీనికి అర్హురాలినవ్వడానికి నేనేం చేశానో నాకు తెలియదు.. ‘చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’.. ఈ అద్భుతమైన సంఘటన విషయంలో నేను మీ గురించి గర్వపడుతున్నాను.. మీరు చేస్తున్న మంచి పనుల కోసం నా వంతు సాయాన్ని తప్పకుండా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు అనసూయ.

2021 మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపే ఎంతో మంది మహిళల గొప్ప‌దనాన్ని చాటే కథలను ‘చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్’ ప్రేక్షకులకు తెలియపరచనుంది. ఈ కార్యక్రమంలో అన‌సూయ‌కు చోటు ద‌క్కింది. ఆమెకి లభించిన ఈ అరుదైన గౌర‌వంపై ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)