Anil Ravipudi : కరోనా నుండి కోలుకున్న అనిల్ రావిపూడి..
ఇటీవల కరోనా బారినపడిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు.. ఏప్రిల్ 13న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు..

Anil Ravipudi Recovered From A Bout Of Covid 19
Anil Ravipudi: కరోనా సెకండ్ వేవ్‌లో ప్రతి క్షణం ఏం జరుగుతోందనే భయాందోళనలో ఉన్నారు జనాలు.. ఇప్పటికే పలు భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ మహమ్మారి బారినపడ్డారు.. పవన్ కళ్యాణ్, సోనూ సూద్ వంటివారు కోలుకోగా.. అల్లు అర్జున్ కూడా తనకు కరోనా సోకినట్లు తెలిపారు.
ఇటీవల కరోనా బారినపడిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు.. ఏప్రిల్ 13న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు..
‘పటాస్’ తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్.. ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి వరుస హిట్స్ కొట్టారు.. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ కు సీక్వెల్ ‘ఎఫ్ 3’ మూవీని తెరకెక్కిస్తున్నారు.. ఇటీవల మైసూర్‌లో షూటింగ్ జరిగింది.. ఆ టైంలోనే కోవిడ్ పాజిటివ్ రావడంతో హోమ్ ఇసోలేషన్‌లో ఉండి, తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నుండి కోలుకున్నారు అనిల్ రావిపూడి..