Anushka – Naveen Polishetty : టైటిల్ అదిరిపోయిందిగా..!

ఈ సినిమాకు ఓ టైటిల్ ఫిక్స్ చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..

Anushka – Naveen Polishetty : టైటిల్ అదిరిపోయిందిగా..!

Anushka And Naveen Polishetty Movie Title As Ms Shetty Mr Polishetty

Updated On : June 7, 2021 / 2:41 PM IST

Anushka – Naveen Polishetty: ‘1 నేనొక్కడినే’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో తెలుగులో, ‘చిచ్చోరే’ తో హిందీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించనున్నాడు..

నవీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించబోతున్నాడు.. ‘బాహుబలి’ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైలెన్స్’ – ‘నిశ్శబ్దం’ ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. స్వీటీ పర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాలో నటించనుంది.

రీసెంట్‌గా ఈ సినిమాకు ఓ టైటిల్ ఫిక్స్ చేశారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ మూవీకి ‘‘మిస్టర్ శెట్టి.. మిసెస్ పొలిశెట్టి’’ అనే పేరు కన్ఫమ్ చేసేశారని అంటున్నారు. ‘‘మిస్టర్ శెట్టి మిసెస్ పొలిశెట్టి’’.. రైమింగ్ అదిరిపోయింది అంటూ పలు మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం.. ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో, సూపర్ హిట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అందించిన యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ మూవీ ప్రొడ్యూస్ చెయ్యనుంది.