ఆర్య ‘టెడ్డీ’ ట్రైలర్ చూశారా..

ఆర్య ‘టెడ్డీ’ ట్రైలర్ చూశారా..

Updated On : February 24, 2021 / 7:51 PM IST

Teddy Trailer: తమిళ యువనటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెడ్డీ’. పెళ్లి తర్వాత ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్‌ నటస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. స్టూడియోగ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తుండగా.. గ్రాఫిక్స్‌తో కూడిన సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Teddy Trailer
తాజాగా ‘టెడ్డీ’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. జయం రవితో ‘టిక్‌ టిక్‌ టిక్‌’ అనే స్పై చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ మూవీలో ఒక సామాజిక అంశానికి గ్రాఫిక్స్‌ జతచేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారనిపిస్తోంది. కథలో టెడ్డీకి కూడా ప్రాధాన్యత కల్పించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

Teddy Trailer

డైరెక్టర్ మగి తిరుమేని ఈ సినిమా ద్వారా విలన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సతీష్, కరుణాకరన్, సాక్షి అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 12 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ‘టెడ్డీ’ స్ట్రీమింగ్ కానుంది.. ఈ సినిమాకి సంగీతం : డి.ఇమాన్, కెమెరా : ఎస్.యువ, ఎడిటింగ్ : టి.శివానందీశ్వరన్.