Bheemla Nayak: భీమ్లా నాయక్ ఎంట్రీ అదుర్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రల

Bheemla Nayak
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మాస్ రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఈరోజు(ఆగష్టు 15) సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఒక్కో అప్డేట్ అండ్ పోస్టర్ తో మేకర్స్ అంతకు మించిన హైప్ తీసుకొస్తుండంతో ఈ అప్డేట్ పై పవన్ అభిమానుల్లో ముందుగానే మరింత హీట్ పెరుగుతూ వచ్చింది. అందుకు తగ్గట్లే భీమ్లా నాయక్ ఎంట్రీ అదుర్స్ అనిపించింది.
విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ లో పవన్ లుంగీలో పక్కా మాస్ యాక్షన్ మూడ్ లో దిగిపోతుంటే అభిమానులకు కన్నుల పండుగగా మారింది. ఇందులో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. మలయాళం అయ్యప్పనుమ్ సినిమాను మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి.. పవన్ మేనరిజానికి తగ్గట్లుగా స్పెషల్ టచ్ ఇచ్చినట్లుగా ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ స్పష్టం చేస్తుంది.
ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ అందించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందికి తీసుకురావడనికి ప్రయత్నిస్తున్నారు. కోవిద్ సెకండ్ వేవ్ తరువాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించనున్నారు.