‘భూమ్ బద్దల్’ వీడియో సాంగ్ వచ్చేసింది..

Bhoom Bhaddhal: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘క్రాక్’.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ఇది.. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అవడమేకాక నిర్మాతకు, బయ్యర్లకు లాభాలు పంచుతోంది.
థమన్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘భూమ్ బద్దల్’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. రవితేజ పక్కన అప్సర రాణి ఈ పాటలో కాలు కదిపింది. రవితేజ, అప్సర ఇద్దరూ ఎనర్జిటిక్‌గా స్టెప్స్ ఇరగదీసేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ పాడారు.. జానీ మాస్టర్ మాంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. జి.కె.విష్ణు విజువల్స్ పాటకు మరింత అందాన్నిచ్చాయి.. ‘భూమ్ బద్దల్’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.