బెంగాల్ లో హింసకు వ్యతిరేకంగా మే 5న బిజెపి ధర్నా

అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తరువాత కూడా బెంగాల్ లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో అసన్సోల్‌ లో ఉన్న బిజెపి కార్యాలయాన్ని

బెంగాల్ లో హింసకు వ్యతిరేకంగా మే 5న బిజెపి ధర్నా

Bengal Post Poll Violence

Updated On : May 4, 2021 / 7:52 AM IST

bengal post poll violence: అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తరువాత కూడా బెంగాల్ లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో అసన్సోల్‌ లో ఉన్న బిజెపి కార్యాలయాన్ని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ఘటనపై బీజేపీ భగ్గుమంది.. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) జరిపిన హింసకు వ్యతిరేకంగా మే 5 న (మమతా బెనర్జీ బెంగాల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజు) జాతీయస్థాయి ధర్నా నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ సోమవారం ప్రకటించింది.

పార్టీలోని అందరూ వ్యక్తులు మండలాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించి నిరసన నిర్వహిస్తారని కాషాయ పార్టీ సమాచారం ఇచ్చింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర పరిస్థితి, బిజెపి కార్యకర్తలపై దాడులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కైలాష్ విజయవర్గియా తెలిపారు. ఈ సందర్బంగా గాయపడిన కార్యకర్తలను పరామర్శించే అవకాశం ఉందని చెప్పారు. నందిగ్రామ్ లో మమత ఓటమిని తట్టుకోలేని టిఎంసి రెచ్చిపోతుందని.. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.