BJP Aggression : బైపోల్స్‌లో బీజేపీ దూకుడు.. 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల్లో కమల వికాసం

బైపోల్స్ లో బీజేపీ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో కమలం వికసించింది.

BJP Aggression : బైపోల్స్‌లో బీజేపీ దూకుడు.. 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల్లో కమల వికాసం

Updated On : November 6, 2022 / 4:53 PM IST

BJP Aggression : బైపోల్స్ లో బీజేపీ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో కమలం వికసించింది. 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీహార్ లో బీజేపీ, ఆర్జేడీ చెరో స్థానంలో గెలుపొందగా.. మహారాష్ట్రలో శివసేన విజయం సాధించింది. హర్యానా, యూపీలోనూ కాషాయ జెండా ఎగురవేశారు. ఒడిశాలో బీజేపీ లీడింగ్ లో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.

ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 బీజేపీ, రెండు కాంగ్రెస్, ఒకటి శివసేన, మరొకటి ఆర్జేడీ పార్టీ సిట్టింగ్ స్థానాలు. దేశంలోనే అత్యధికంగా మునుగోడు ఉపఎన్నికలో అధికశాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రానాథ్, హర్యానాలోని అధంపూర్, బీహార్ లోని గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందింది. బీహార్ నితీశ్ కుమార్-తేజస్వీ యాదవ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి ఈ ఉపఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ చెరో స్థానంలో గెలుపొందాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బీహార్ లోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరిచిన ఆర్జేడీ అభ్యర్థి నీలమ్ దేవి చివరివరకు అదే లీడింగ్ నిలబెట్టుకుంటూ వచ్చారు. చివరికి 16వేల 741 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై ఘన విజయం సాధించారు. ఇక నీలమ్ దేవి గెలుపుతో మొకామాలో ఆర్జేడీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. మిఠాయిలు పంచుకుంటూ, టపాసులు పేల్చుకుంటూ ఎంజాయ్ చేశారు.

ఇక బీహార్ లోని మరో అసెంబ్లీ నియోజకవర్గం గోపాల్ గంజ్ లో బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై కుసుమా దేవి గెలుపొందారు. దీంతో పాట్నాలోని బీజేపీ ఆఫీసు ముందు కమలనాథులు సంబరాలు చేసుకున్నారు. అటు ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లోక్ సభ పరిధిలోని గోలా గోక్రానాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంది.