Prabhas-Krithi Sanon : ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ నిజమేనా..?? లీక్ చేసిన బాలీవుడ్ హీరో..??

ఇండియాలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా చేరిపోయాడు. ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు కానీ ప్రభాస్ మాత్రం భారీ సినిమాలని లైన్లో పెడుతూ................

Prabhas-Krithi Sanon : ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ నిజమేనా..?? లీక్ చేసిన బాలీవుడ్ హీరో..??

Bolywood hero comments on Prabhas and Krithi Sanon relation

Updated On : November 28, 2022 / 10:11 AM IST

Prabhas-Krithi Sanon :  ఇండియాలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా చేరిపోయాడు. ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు కానీ ప్రభాస్ మాత్రం భారీ సినిమాలని లైన్లో పెడుతూ వాటితోనే బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడకపోయినా అయన పెళ్లి వార్తలు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.

గతంలో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు నడిచాయి. కొన్ని రోజుల నుంచి కృతి సనన్, ప్రభాస్ మధ్య ఏదో ఉందని బాలీవుడ్, టాలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆదిపురుష్ టీజర్ ప్రమోషన్స్ లో కృతి సనన్ ప్రభాస్ ని చేయి పట్టించుకోని నడిపించడం, ప్రభాస్ కి చెమట వస్తే తన చీర కొంగు ఇవ్వడం, బాలీవుడ్ లో ఒక షోకి వెళ్తే ప్రభాస్ కి కాల్ చేయడం, ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ ఉంటే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం.. ఇలా అనేక సంఘటనలు చూసి ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారేమో అని అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు అని పోస్టులు చేస్తున్నారు. ఇటీవలే కృతి సనన్, వరుణ్ ధావన్ కలిసి తోడేలు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ఓ షోలో పాల్గొన్నారు. ఈ షోలో కరణ్ జోహార్ కృతి సనన్ ని నీ హార్ట్ లో ఎవరు ఉన్నారు అని అడగడంతో వరుణ్ ధావన్ దీనికి సమాధానమిస్తూ.. కృతి సనన్ మనసులో ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ముంబైలో లేడు. ప్రస్తుతం దీపికా పదుకొనేతో సినిమా షూటింగ్ లో ఉన్నాడు అని చెప్పాడు.

Cyber Crime Police : పవిత్ర లోకేష్ ఫిర్యాదుతో.. 15 యూట్యూబ్ ఛానల్స్ కి నోటీసులిచ్చిన సైబర్ క్రైమ్..

ప్రస్తుతం దీపికా ప్రాజెక్ట్ K షూటింగ్ లో ఉంది. ఇందులో హీరో ప్రభాస్. ఇలా వరుణ్ ధావన్ ఇండైరెక్ట్ గా ప్రభాస్-కృతి సనన్ గురించి చెప్పడంతో మరోసారి నెటిజన్లు ప్రభాస్-కృతి సనన్ ని వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై కృతి సనన్ మాత్రం స్పందించలేదు.