Cyber Crime Police : పవిత్ర లోకేష్ ఫిర్యాదుతో.. 15 యూట్యూబ్ ఛానల్స్ కి నోటీసులిచ్చిన సైబర్ క్రైమ్..

పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారని తనని వదిలేశారని కొన్నాళ్ల క్రితం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఎక్కువగా జంటగానే కనపడుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవిత్ర లోకేష్.............

Cyber Crime Police : పవిత్ర లోకేష్ ఫిర్యాదుతో.. 15 యూట్యూబ్ ఛానల్స్ కి నోటీసులిచ్చిన సైబర్ క్రైమ్..

Cyber Crime Police gives notices to 15 youtube channels in pavitra lokesh case

Cyber Crime Police :  పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఉంటున్నారని తనని వదిలేశారని కొన్నాళ్ల క్రితం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నరేష్, పవిత్ర లోకేష్ ఎక్కువగా జంటగానే కనపడుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవిత్ర లోకేష్ జంటగానే వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి.

అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వీరి ఫోటోలని, వీడియోల్ని వాడుతూ ట్రోల్ చేశారు. కొంతమంది మరీ ముందుకెళ్లి అసభ్యకరమైన వీడియోల్ని కూడా పోస్ట్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం చేశారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్, నరేష్ జంట వైరల్ గా ఉంది. దీంతో పవిత్ర లోకేష్ వీటిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.

Taapsee Pannu : మరోసారి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో 15 యూట్యూబ్ ఛానళ్లకి, పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్స్‌కి నోటీసులు పంపించారు. మూడు రోజుల్లోగా విచారణకి రావాలని లేదా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని సైబర్ క్రైం పోలీసులు నోటీసుల్లో తెలిపారు.