Gram Panchayat Funds: నిర్మలమ్మ తీపికబురు.. పంచాయతీలకు కేంద్ర నిధులు!
కరోనా కష్టకాలంలో కేంద్రం రాష్ట్రాలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గ్రామ పంచాయతీయలకు ఆర్ధిక సంఘం సిఫార్సులతో తొలి విడత నిధులను కేంద్రం మంజూరు చేసింది.

Gram Panchayat Funds
Gram Panchayat Funds: కరోనా కష్టకాలంలో కేంద్రం రాష్ట్రాలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గ్రామ పంచాయతీయలకు ఆర్ధిక సంఘం సిఫార్సులతో తొలి విడత నిధులను కేంద్రం మంజూరు చేసింది. దేశంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి 8,923.80 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ నిధులను గ్రామ పంచాయితీలకు ఖర్చు చేయాలని సూచించింది. నిజానికి ఈ నిధుల విడుదలకు ఇంకాస్త సమయం ఉంది. కానీ కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
కాగా, కేంద్రం నిధులు విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.387.8 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లు కేటాయించింది. కేంద్ర ఎకానమిక్ కమిషన్ రికమండేషన్స్ ప్రకారం గ్రామాల జనాభాను ఆధారంగా చేసుకుని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఈ నిధులను విడుదల చేసింది. పంచాయతీలకు ఈ నిధులు అందాలంటే కచ్చితంగా పాలకవర్గం కొలువుదీరి ఉండాలనే నిబంధన ఒకటుంది. అందుకే 2018 ఆగస్టు తర్వాత ఏపీలో పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఈ నిధులు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటవడంతో ఏపీ కూడా ఈ నిధులు దక్కించుకుంది.
Read: East Godavari: గుంపులుగా గుంపులుగా ప్రజలు.. ఆందోళన కలిగిస్తున్న వ్యాక్సినేషన్!