Z Category Security To Mp Owaisi
Centre Provides Z Category Security To AIMIM MP Owaisi : ఉత్తరప్రదేశ్ లో ఎన్నిక ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా..ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై అంగంతకులు తుపాకులతో కాల్పుల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఒవైసీకి జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. గురువారం (ఫిబ్రవరి 3,2022) కాల్పుల ఘటన తర్వాత ఎంపీ ఒవైసీ భద్రతపై కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది.
Also read : High alert in Hyd old city : యూపీలో ఎంఐఎం ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు..హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్
సమీక్ష అనంతరం.. సీఆర్ఫీఎఫ్‌తో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో తక్షణమే ఒవైసీకి సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోం శాఖ.కాగా..ఒవైసీపై కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఈసీని డిమాండ్ చేసిన ఒవైసీ.. ఈ దాడి వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని దీనిపై దర్యాప్తు జరిపించాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తనపై జరిగిన దాడి వెనుక మాస్టర్ మైండ్ ఉందని..అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also read : Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు
కాగా ఒవైసికి జెడ్ ప్లస్ కేటగిరీలో.. నలుగురు నుంచి ఆరుగురు NSG కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 22 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో.. ఒక ఎస్కార్ట్ కారుతో పాటు ఢిల్లీ పోలీసులు లేదంటే ITBP లేదంటే CRPF సిబ్బంది ఉంటారు.
Also Read : MP Asaduddin Owaisi : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు
Also Read : Asaduddin Owaisi: ఢిల్లీ చేరిన ఒవైసీ.. ‘స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’