Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

Owaisi

Updated On : February 4, 2022 / 8:12 AM IST

Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ, ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిగాయి.

కాల్పుల కారణంగా ఓవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో ఢిల్లీ బయల్దేరారు అసదుద్దీన్ ఓవైసీ. దాడి అనంతరం.. తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి యత్నించారని, వారిలో ఇద్దరు బుల్లెట్లు పేల్చారని ఒవైసీ చెప్పారు.

అంతకుముందు మీరట్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కంటే ఎస్పీ, బీఎస్పీ తక్కువేమీ కాదని ఒవైసీ అన్నారు. ఎంతకాలం ఈ పార్టీల కోసం ముస్లింలు త్యాగాలు చేయాలని ప్రశ్నించారు.