Asaduddin Owaisi: ఢిల్లీ చేరిన ఒవైసీ.. ‘స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’

ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయల్దేరుతుండగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై మీరట్ వద్ద ఆగంతుకుల దాడి జరిగింది.

Asaduddin Owaisi: ఢిల్లీ చేరిన ఒవైసీ.. ‘స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’

Owaisi

Asaduddin Owaisi: ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయల్దేరుతుండగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై మీరట్ వద్ద ఆగంతుకుల దాడి జరిగింది. టైర్ పంక్చర్ కావడంతో మరో కారులో బయల్దేరిన ఒవైసీ ఢిల్లీకి చేరుకోగలిగారు. ఈ సందర్భంగా మాట్లాడి.. దాడిపై స్పీకర్‌కు కంప్లైంట్ చేస్తానంటున్నారు.

‘నాపై జెర్సీ టోల్ ప్లాజా వద్ద మూణ్నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. అడిషనల్ ఎస్పీ ఫోన్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఒక షూటర్‌ని పట్టుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నా’ అని చెప్పారు.

‘కాల్పుల ఘటనపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో వచ్చిన బెదిరింపులన్నీ పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లి.. స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’ అంటున్నారు ఒవైసీ.

Read Also: తగ్గేదేలే.. రజినీని మించిపోయిన బన్నీ!

దాడి ఎలా జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ, ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిగాయి.

కాల్పుల కారణంగా ఓవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో ఢిల్లీ బయల్దేరారు అసదుద్దీన్ ఓవైసీ. దాడి అనంతరం.. తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి యత్నించారని, వారిలో ఇద్దరు బుల్లెట్లు పేల్చారని ఒవైసీ చెప్పారు.