High alert in Hyd old city : యూపీలో ఎంఐఎం ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు..హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్

యూపీలో ఒవైసీ కారుపై కాల్పులు ఘటన తరువాత హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.

High alert in Hyd old city : యూపీలో ఎంఐఎం ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు..హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్

Asaduddin Owaisi's Car Fired

gun fired on owaisi’s car fired in UP..High alert in Hyd old city : హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతం అంటే చాలు ఠక్కున గుర్తుకొచ్చేది పాత బస్తీ. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ ప్రాంతంలో విభిన్న ప్రాంతాల ప్రజలు..మతాలకు అతీతంగా జీవిస్తున్నాయి. ఇటువంటి పాతబస్తీ ఎంఐఎం పార్టీ అధీనంలో ఉంటుంది. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్ పర్యటలో ఉన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై గురువారం (ఫిబ్రవరి 3,2020)న కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. యూపీలో ఒవైసీపై కాల్పులు జరిగిన క్రమంలో హైదరాబాద్ పాతబస్తీలో హై అలర్ట్ అయ్యింది. పోలీసులు పాతబస్తీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి నిఘా కళ్లతో నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు ఏం జరగుతుంతో తెలియని క్రమంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

Also read : Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

కాగా..యూపీలోని మీరట్ లో ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కారులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలో ఎంఐఎం కూడా పోటీ చేయనున్న క్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో టోల్ ప్లాజా దగ్గర అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. కారు డోర్ లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత మరో వాహనంలో ఢిల్లీ సురక్షితంగా చేరుకున్నారు. తాను సురక్షితంగానే ఉన్నాయని ఎవ్వరు ఆందోళన చెందవద్దని ఆయన వెల్లడించారు.కానీ ఈ ఘటనను సహించేది లేదని తనపై జరిగిన కాల్పుల్లో రాజకీయ కోణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read : MP Asaduddin Owaisi : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిపిన దుండగుడు అరెస్టు

మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ, ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వస్తున్న సమయంలో ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర అసద్ వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల కారణంగా ఓవైసీ వాహనం టైర్లు పంక్చర్ కావడంతో మరో వాహనంలో అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ బయల్దేరారు.దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి యత్నించారని, వారిలో ఇద్దరు బుల్లెట్లు పేల్చారని ఒవైసీ చెప్పారు. అంతకుముందు మీరట్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమాలు ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన క్రమంలో ఒవైసీ కారుకు ముందు ఒక సఫారీ, వెనుకాల రెండు ఫార్చ్యూనర్ వాహనాలున్నాయి. ఛజార్సీ టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా మా వాహనాలు స్లో అయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఒవైసీ కారు డ్రైవర్ కాల్పులు జరుగుతున్నాయని గ్రహించి..వెంటనే వారి ముందున్న వాహనాన్ని ఢీకొడుతూ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు.

Also Read : Asaduddin Owaisi: ఢిల్లీ చేరిన ఒవైసీ.. ‘స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’

ఈక్రమంలో సదరు దుండగుడు వారి కారు ఎడమ వైపుకు వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరుపగా..కారుకు రెండు బుల్లెట్లు తగిలాయి. కాల్పులు జరిపినవారిలో ఒకరు ఎరుపు జాకెట్, ఒకరు తెలుపు జాకెట్ ధరించి ఉన్నారని ఒవైసీ తెలిపారు.. మా వెనకాల ఉన్న ఫార్చ్యూనర్‌లో ఉన్నవాళ్లు దుండగులపైకి వాహనాన్ని తీసుకెళ్లారు. అందులో ఒకరి కాలుపై నుంచి ఫార్చ్యూనర్ వెళ్లింది. తెలుపు జాకెట్లో ఉన్న వ్యక్తి అక్కణ్ణుంచి పారిపోయాడు.

కాసేపటి తర్వాత అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి ఫోన్ చేశాడు. కాల్పులకు పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలున్నాయి అని అసదుద్దీన్ పేర్కొన్నారు. కాల్పులు జరిపినవారిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు జరిపారు? వారి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే పలు కీలక కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.