VIP security to Gautam Adani: గౌతమ్ అదానీకి వీఐపీ భద్రత కల్పించిన మోదీ ప్రభుత్వం
గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. 2013లో ముకేశ్‌కు ఈ భద్రత కల్పించగా ఆయన భార్య నీతా అంబానీకి కొన్నాళ్లకు తక్కువ కమాండోలతో భద్రత కల్పించారు.

Centre grants VIP security cover to industrialist Gautam Adani
VIP security to Gautam Adani: అదాని గ్రూప్ చైర్మన్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమి అదానికి ‘జెడ్’ కేటగిరీ వీఐపీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. అదాని(60)కి భద్రతా సమస్య ఉందని జాతీయ భద్రతా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ భద్రతకు అదాని నుంచి పేమెంట్ తీసుకోనున్నట్లు కేంద్ర వెల్లడించింది. నెలకు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేయనున్నారట.
గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. 2013లో ముకేశ్‌కు ఈ భద్రత కల్పించగా ఆయన భార్య నీతా అంబానీకి కొన్నాళ్లకు తక్కువ కమాండోలతో భద్రత కల్పించారు.
Security breach: అజిత్ ధోవల్ ఇంటి వద్ద భద్రతా లోపం.. ముగ్గురు కమాండోల తొలగింపు