షాకింగ్ : పాములను చంపి..వాటి పిత్తాశయాన్ని తిన్నాడు..చివరకు

చైనా ప్రజల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలియని వారికి కూడా తెలిసొచ్చింది. వారి తిండి భయానకంగా ఉంటుంది. ప్రతి జీవిని తింటుంటారు. కరోనా వైరస్ తర్వాత…వీరు తినే ఆహార విషయంలో తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. చివరకు కొన్ని ఆహార పదార్థాలను బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఇంత జరిగినా..కొందరు మాత్రం ఆహారపు అలవాట్లను మానుకోలేదంట. దీనికి సంబంధించిన ఓ ఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ.
సుక్వీన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి..కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతని ఆహార పదార్థాల గురించి ప్రశ్నించారు. ప్రతి రోజు ఏం తింటావ్ ? అని ప్రశ్నించారు. సీ పుడ్స్ తింటానని చెప్పాడు. అంతేగాకుండా..పాములను చంపి..వాటి పిత్తాశయాన్ని పచ్చిగా తింటానని తాపీగా చెప్పాడు.
ఇతడిని స్కాన్ చేశారు. తినే ఆహారం వల్ల ఊపిరితిత్తుల్లో పురుగులు వచ్చి చేరాయని డాక్టర్లు చెప్పారు. పాముల పిత్తాశయం తినడం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. పాములు, సీ ఫుడ్స్ పచ్చిగా తినడం వల్ల వీటిలో జీవించే..టేప్ వార్మ్ వంటి పరాన్నజీవుల గుడ్లు శరీరంలోకి వెళుతాయని, దీంతో అనారోగ్యానికి గురవుతారని డాక్టర్ జహ్వో హయన్ వెల్లడించారు. (గుడ్డు ఖరీదు నెల జీతం కంటే ఎక్కువ..)