New Variant omicron : కొత్త వేరియంట్ ను అడ్డుకోవటానికి సీఎం కేజ్రీవాల్ ముందస్తు జాగ్రత్తలు..
ఆఫ్రికా దేశాల్లో కలకలం రేపుతున్న కరోనా న్యూవేరియంట్ కేసుల హడలెత్తిస్తున్నాయి. ఈక్రమంలో సీఎం కేజ్రీవాల్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకునేపనిలో ఉన్నారు.

Covid 19 New Variant Omicron
Covid-19 New Variant omicron :ఆఫ్రికా దేశాల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్, సైంటిఫిక్ ఎక్స్ పర్ట్ లతో సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్ గుబులు నెలకొన్న క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలపాని నిపుణులను కోరానని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో కేజ్రీవాల్ కరోనానుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కాబట్టి మనదేశంలోకి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాబట్టి ఆఫ్రికా దేశాలనుంచి వచ్చే విమాన సర్వీసుల్ని నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరారు. ఆఫ్రికా దేశాల నుంచి స్ట్రెయిన్ మన దేశంలో ప్రవేశించే అవకాశం ఉందన్న సూచనలతో సీఎం కేజ్రీవాల్ నిపుణులతో సమావేశం కానున్నారు. ‘ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత..ఎంతోమందిని కోల్పోయిన తరువాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని అన్నారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు.
కాగా..కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయా? తగ్గిందనుకున్నప్పుడల్లా….కొత్త వేరియంట్లతో విరుచుకుపడనుందా? కరోనా తన నైజం మార్చుకుంటోందా? ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించేందుకు వైరస్ కాచుక్కూచుందా? అనంటే నిజమననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలై బొట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్, డెన్మార్క్‌కు వ్యాపించిన వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఊహించనంత వేగంగా వ్యాపిస్తుండడంతో….వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేదానిపై శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.
వేరియంట్‌పై పరిశోధనల్లో వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. దక్షిణాఫ్రికాలో వేరియంట్ వెలుగుచూడగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు, అమెరికా….దక్షాణిఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇది అన్యాయమైన చర్యని దక్షిణాఫ్రికా, భయాందోళన చెందవద్దని WHO అంటున్నా ..గతంలో కరోనా కల్లోలాన్ని అనుభవించిన దేశాలు ముందు జాగ్రత్త పాటిస్తున్నాయి.