shabbir ali: రేవంత్‌రెడ్డి లేకుండానే నేడు, రేపు చింతన్ శిబిర్: షబ్బీర్ అలీ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ చింతన్ శిబిర్ సీఎల్పీ అధ్వర్యంలో జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు.

Shabbir Ali
shabbir ali: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న చింతన్ శిబిర్ మేడ్చల్ జిల్లా కీసరలో సమీపంలోని బాలవికాస్‌లో జరగనుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో నేడు, రేపు చింతన్ శిబిర్ జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఈ సదస్సులో ప్రధానంగా ఉదయ్ పూర్ డిక్లరేషన్‌పై చర్చిస్తామని ఆయన వివరించారు. ఏఐసీసీ సూచనల మేరకు ఈ సదస్సులో ఆరు అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
ఏఐసీసీ డిక్లరేషన్‌ను అమోదిస్తూనే రాష్ట్ర అంశాలనూ చేరుస్తామని వివరించారు. నేడు పూర్తిగా చర్చలు ఉంటాయని ఆయన అన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను రేపు అమోదిస్తామని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ చింతన్ శిబిర్ సీఎల్పీ అధ్వర్యంలో జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు. పలు అంశాలపై చర్చించేందుకు తాము ఏర్పాటు చేసిన ఆరు కమిటీల చర్చల సారాంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు వచ్చాక అమోదించాలా? లేదా? తామే ఆమోదించాలా? అన్న అంశంపై నేటి సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.