corona Effect on Tollywood : ‘సినిమా’ కష్టాలు.. సెకండ్ వేవ్ కారణంగా 15 వేల కుటుంబాలు రోడ్డు పాలు..

కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఇప్పుడు థియేటర్లు కూడా మూతపడ్డాయి..

corona Effect on Tollywood : ‘సినిమా’ కష్టాలు.. సెకండ్ వేవ్ కారణంగా 15 వేల కుటుంబాలు రోడ్డు పాలు..

Corona Second Wave Effect On Tollywood Film Indistry

Updated On : April 22, 2021 / 4:16 PM IST

Second Wave Effect: కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్‌ వేవ్‌తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఇప్పుడు థియేటర్లు కూడా మూతపడ్డాయి..
దీంతో సినీ జనాలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు..

ఈ సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమపై ఆధారపడ్డ దాదాపు 15 వేల కుటుంబాలు కష్టాలు ఎదుర్కోనున్నాయి.. 50 మందితో షూటింగ్స్ చేసుకోవచ్చని చెప్పినా కానీ ఎవరూ ధైర్యం చేసే పరిస్థితి లేదు.. ఇప్పటికే రిలీజ్ డేట్స్ వాయిదా వేశారు.. చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాల వరకు ఓకే అనుకున్నా.. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు మాత్రం భయపడిపోయే పరిస్థితి నెలకొంది..
మే 13న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ లో కీలకపాత్రలో నటిస్తున్న రియల్ హీరో సోనూ సూద్ కరోనా బారిన పడడంతో షూటింగ్ వాయిదా వేశారు.. ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’, ‘విరాట పర్వం’ సినిమాలను ఇప్పటికే వాయిదా వేశారు నిర్మాతలు..

ప్రస్తుతానికి షూటింగ్స్, రిలీజులు వంటివి పూర్తిగా పక్కన పెట్టేసి, ఓ రెండు నెలలపాటు అందరికీ వ్యాక్సినేషన్ అయ్యాక, పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాక ఆలోచిద్దాం అని సినీ పెద్దలు చర్చించుకుంటున్నారు. నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్, రవిశంకర్, రాజ్ కందుకూరి తదితరులు సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బుందులు ఎదుర్కోబోతోందనే అంశంపై 10 TV తో మాట్లాడారు..