Viral video : అబ్బా..గోల్ ఎంతబాగా వేశానో..కొమ్ములతో జింక గోల్..నెటిజన్లు ఫిదా

ఓ జింక బంతిని గోల్ చేసి భలే మురిసిపోయింది. అబ్బా..నాక్కూడా గోల్ వేయటం వచ్చేసిందే..అన్నట్లుగా బంతిని గోల్ చేసి గెంతులు వేసింది ఆనందంగా.

Viral video : అబ్బా..గోల్ ఎంతబాగా వేశానో..కొమ్ములతో జింక గోల్..నెటిజన్లు ఫిదా

Deer Scoring Boll Goal

Updated On : December 18, 2021 / 5:50 PM IST

deer scoring boll goal : జింక. కొమ్మల్లాంటి కొమ్ములతో భలే ఉంటుంది. దాని కొమ్ములే జింకకు ప్రధాని ఆకర్షణ. కొమ్ములున్న ఓ జింక బంతిని గోల్ చేసి భలే మురిసిపోయింది. అబ్బా..నాక్కూడా గోల్ వేయటం వచ్చేసిందే..అన్నట్లుగా బంతిని గోల్ చేసి గెంతులు వేసింది ఆనందంగా..దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఇప్పటిది కాకపోయాని ఆ జింక గోల్ కు ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. రెండేండ్ల కిందటి నాటి వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంత ఆనందం పడుతోంది ఈ మూగ జంతువు అంటున్నారు.ఒక జింక తన కొమ్ములతో బంతిని గోల్‌పోస్ట్‌ వరకు నెట్టుకుని వస్తుంది. చివరకు కొమ్ములతో గట్టిగా బంతిని నెట్టి గోల్‌ చేస్తుంది. బంతిని గోల్‌లోకి తోసిన ఆనందంతో గెంతుతూ చిందులు వేసింది.

12 సెకండ్ల నిడివి ఉన్న 2019లో కూడా చక్కటి వ్యూస్ తెచ్చుకుంది. కరోనా కొత్త కొత్త వేరియంట్ల వచ్చి హడలెత్తిస్తున్న క్రమంలో ఫుట్‌బాల్‌ క్రీడలు అంతగా జరుగని ఈ సమయంలో మరోసారి ఈ వీడియో ఫుట్‌బాల్‌ ప్రేమికులతో పాటు అందరిని అలరిస్తోంది.