Tamannaah: త్వరలోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తమన్నా!

అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపేసింది. ఆ మధ్య కాస్త స్లో అయినా.. ఇప్పుడు మళ్లీ..

Tamannaah: త్వరలోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తమన్నా!

Tamannaah (image : Instagram)

Updated On : April 9, 2022 / 6:22 PM IST

Tamannaah: అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా గడిపేసింది. ఆ మధ్య కాస్త స్లో అయినా.. ఇప్పుడు మళ్లీ పికప్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఛాన్స్ నీ యూజ్ చేసుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్ లో బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా బాగా హడావిడిచేస్తోంది. అసలు ఖాళీ లేకుండా సిరీస్ లు, స్మాల్ స్క్రీన్ మీద ప్రోగ్రామ్స్ సహా అన్నీ చేస్తూనే సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది.

Tamannaah: ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్.. రచ్చ చేస్తున్న తమ్మూ!

ప్రస్తుతం తెలుగు, హిందీలో అరడజను సినిమాలతో బిజీగానే ఉన్న తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ తమన్నా కోసం ఓ మంచి వరుడిని ఎంపిక చేశారని వార్త ప్రచారంలోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ తో త్వరలోనే తమన్నా వివాహం జరగనుందని తెగ ప్రచారం జరిగిపోయింది. దీనిపై తాజాగా స్పందించిన తమన్నా తనకు అసలు ఇప్పడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చేపారేసింది.

Tamannaah: తగ్గేదేలే.. క్రేజీ రికార్డ్ మిల్కీ బ్యూటీ సొంతం!

తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్నాకు పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దానికి తమన్నా ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఫైనల్ గా మరో రెండేళ్ల దాకా పెళ్లి ఊసే వద్దని క్లారిటీ ఇచ్చేసింది. మరి గాసిప్ రాయుళ్లు దీనిపై ఏమంటారో మరి!