Enforcement Directorate: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు బెయిల్ తిరస్కరణ
నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Satyendra Jain
Enforcement Directorate: నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటోన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తిరస్కరించింది.
agnipath: సికింద్రాబాద్‌లో పలు రైళ్ళు రద్దు.. హింస ఘటనలో దర్యాప్తు ముమ్మరం
కాగా, సత్యేందర్ జైన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. సత్యేందర్ జైన్ 2017 నుంచి నగదు అక్రమ చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 2015-16లో కోల్‌కతాలోని సత్యేందర్ జైన్ సంస్థలకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసుల్లో ఈడీ విచారణ జరుపుతోంది.