agnipath: సికింద్రాబాద్‌లో ప‌లు రైళ్ళు ర‌ద్దు.. హింస ఘ‌ట‌న‌లో దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో నేడు, రేపు 20 రైళ్ళ‌ను రద్దు చేస్తున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. నేడు 13 రైళ్ళు, రేపు 7 రైళ్ళ‌ను రద్దు చేస్తున్న‌ట్లు చెప్పింది.

agnipath: సికింద్రాబాద్‌లో ప‌లు రైళ్ళు ర‌ద్దు.. హింస ఘ‌ట‌న‌లో దర్యాప్తు ముమ్మరం

Secunderabad Railway Station

agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో నేడు, రేపు 20 రైళ్ళ‌ను రద్దు చేస్తున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. నేడు 13 రైళ్ళు, రేపు 7 రైళ్ళ‌ను రద్దు చేస్తున్న‌ట్లు చెప్పింది. అంతేగాక‌, 9 పార్సల్ రైళ్ళ‌నూ రద్దు చేస్తున్నామ‌ని, మరో 8 రైళ్ళ‌ను దారి మళ్ళిస్తున్నామ‌ని పేర్కొంది. 5 రైళ్ళ‌ షెడ్యూల్ మార్చిన‌ట్లు వివ‌రించింది.

Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

మ‌రోవైపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మ‌క‌ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల అదుపులో సుమారు 100 మంది ఉన్నారు. అలాగే, రైల్వే పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కూడా పోలీసుల అదుపులోనే ఉన్న విష‌యం తెలిసిందే.

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని మోదీ ఉప‌సంహ‌రించుకుంటారు: రాహుల్ గాంధీ

రైల్వేస్టేష‌న్‌పై దాడిచేసిన వారిలో సాయి అకాడమీ విద్యార్థులూ ఉన్నారు. హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసిన కొంద‌రు దాని ద్వారా స‌మాచారం పంపుకున్నారు. సూత్రదారులను గుర్తించేందుకు ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. వాట్సప్ గ్రూప్‌లో రెచ్చగొట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ఐపీసీ సెక్ష‌న్లు 143, 147, 307, 435, 427, 448, 336, 332, 341, 149, 150, 151, 152 ఐఆర్ఏ, 3 పీడీపీపీఏ కింద కేసులు నమోదు నమోదు.