Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

Agnipath: సికింద్రాబాద్ ఘటన.. రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం

Agnipath (4)

Agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలో రైల్వే శాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈస్ట్‌కోస్ట్‌, అజంత, రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆందోళన కారులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఎంఎంటీఎస్ రైళ్లపై దాడి చేయడం, షాపులు, ఫర్నీచర్ వంటి ఇతర రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం, పార్సిళ్లు తగలబెట్టడం వంటివి కూడా జరిగాయి.

Agnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా శుక్రవారం జరిగిన ఘటనలో ప్రాథమిక అంచనా ప్రకారం సికింద్రాబాద్ రైల్వే శాఖకు దాదాపు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.

Damera Rakesh: రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: మంత్రి ఎర్రబెల్లి

బిహార్, ఉత్తర ప్రదేశ్, హరియాణా, అసోం, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆందోళనలు భారీ ఎత్తున జరిగాయి. ఈ రాష్ట్రాల్లో కూడా రైళ్లు తగులబెట్టడం, రైల్వే ఆస్తులపై దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో దేశవ్యాప్తంగా రైల్వే శాఖకు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
Agnipath