Damera Rakesh: రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది.

Damera Rakesh: రాకేష్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: మంత్రి ఎర్రబెల్లి

Damera Rakesh

Damera Rakesh: సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు, యువకులు ఇబ్బంది పడుతున్నారు.

aAgnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

కేంద్ర మొండి వైఖరిని అందరూ ఖండించాలి. సైన్యంలో కూడా ఔట్‌సోర్సింగ్ విధానం తీసుకురావడం దారుణం. మోదీ ఇక నీ రాక్షస పాలన చాలు. ఆర్మీ అభ్యర్థులకు క్షమాపణ చెప్పి దిగిపో. ఒక సైనికుడిని చంపావు. ఆ పాపం ఊరికే పోదు. అగ్నిపథ్‌ను సమర్ధిస్తున్న కేంద్ర మంత్రులు మీ పిల్లల్ని సైన్యంలో చేర్పించండి. మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నల్ల చట్టాలతో అన్నదాతల పొట్ట కొట్టారు. ఇప్పుడు దేశానికి భద్రతగా నిలిచే ఆర్మీలో కూడా నల్ల చట్టాలతో యువత ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేశారు’’ అని వారు విమర్శించారు.