Dog wearing helmet : హెల్మెట్ పెట్టుకోని వాళ్లు ఈ వీడియో చూసైనా మారండి

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత చెవికెక్కడం లేదు. తమిళనాడులో ఓ డాగ్, అతని యజమాని వీడియో చూస్తే అయినా కాస్త ఆలోచిస్తారనిపిస్తోంది.

Dog wearing helmet : హెల్మెట్ పెట్టుకోని వాళ్లు ఈ వీడియో చూసైనా మారండి

Dog wearing a helmet

Updated On : May 25, 2023 / 6:00 PM IST

Dog wearing helmet – viral : హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని పోలీసులు మొత్తుకున్నా జనాలు నిర్లక్ష్యం వీడట్లేదు. రోజూ ఏదో ఒక చోట హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి ప్రమాదం కొని తెచ్చుకున్నవారి గురించి వింటూనే ఉంటున్నాం. అయితే బైక్‌పై యజమానితో పాటు వెళ్తున్న ఓ డాగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Golden Retriever : యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్న డాగ్

ఓ డాగ్, మరో వ్యక్తి ఇద్దరూ బైక్ మీద వెళ్తున్నారు. ఇద్దరు తలపై హెల్మెట్లు ధరించారు. హెల్మెట్ ధరించమని పోలీసులు చెవులు చిల్లులు పడేలా చెబుతున్నా నిర్లక్ష్యం వహించేవారికి అవగాహన కల్పించడం కోసమే అన్నట్లుగా ఉంది ఈ వీడియో. Mohammed Nayeem అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ‘రూల్ ఈజ్ రూల్’ అనే శీర్షికతో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్

వేగంగా బైక్‌లు నడపటం, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు చలాన్లు వేసినా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నా వారికి పట్టట్లేదు. అలాంటి వారికి చైతన్యపరచడం కోసమే అన్నట్లుగా ఈ వీడియో అనిపిస్తోంది. ‘ఈ వీడియో మనుషులకు ఒక గుణపాఠం’ అని ఒకరు.. ‘ఇండియా ప్రకాశిస్తోంది’ మరొకరు తమ వ్యాఖ్యలను జోడించారు. ఇలాంటి వీడియోలు చూసైనా హెల్మెట్ వాడకుండా నిర్లక్ష్యం చేసేవారు మారతారని ఆశిద్దాం.