ysrcp: గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు.. వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నంచి టీడీపీ తరఫున పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.
- T Venkateshwarlu
- Published On : June 12, 2022 / 01:26 PM IST
Vamshi And Dutta
ysrcp: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నంచి టీడీపీ తరఫున పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే, వల్లభనేని వంశీపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే, వంశీపై వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో ఈ విషయం వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. వైసీపీ అధిష్ఠానం పలుసార్లు ఆ నేతలతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు వినట్లేదు.
prophet row: వివాదంపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన బీజేపీ బెంగాల్ నేత అరెస్టు
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి వైసీపీ తరఫున తానే పోటీ చేస్తానని తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే, గన్నవరంలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఇదే అంశంపై దుట్టా రామచంద్ర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, గన్నవరం నుంచి వంశీ తప్ప ఇంకెవరు పోటీ చేసినా తమకు సమ్మతమేనని ఆయన చెప్పారు.
prophet row: యూపీలో 304 మంది నిందితుల అరెస్టు
గన్నవరం ఎమ్మేల్యే వంశీ ఓ పిచ్చి కుక్క అంటూ దుట్టా రామచంద్ర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన 10 టీవీతో మాట్లాడుతూ… తాను పుట్టింది, పెరిగింది, పోటీ చేసింది ఇక్కడేనని అన్నారు. వంశీలా తాను ఎక్కడి నుంచో ఇక్కడకు రాలేదని వ్యాఖ్యానించారు. వంశీకి 16 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే.. తనకు 30 ఏళ్ల అనుభవం ఉందని అన్నారు. తాను ఎంపీపీగా గెలిచినప్పుడు వంశీ రాజకీయాల్లోనే లేరని ఆయన చెప్పారు. వంశీతో కలిసి తాను పనిచేసే ప్రసక్తి లేదని, ఈ విషయాన్ని తమ పార్టీ అధిష్ఠానానికి చెప్పేశానని అన్నారు. వంశీ తప్ప ఇంకెవరు పోటీ చేసినా తమకు సమ్మతమేనని చెప్పారు. గన్నవరంలో మట్టి మాఫియాను వంశీ ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. దీనిపై తాము కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని అన్నారు. మట్టి మాఫియాని అరికట్టాలంటే మట్టి పాలసీ తీసుకురావాలని చెప్పారు.
