prophet row: యూపీలో 304 మంది నిందితుల‌ అరెస్టు 

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై ఆ పార్టీ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హింస చెల‌రేగింది. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో పాల్గొన్న వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తున్నారు.

prophet row: యూపీలో 304 మంది నిందితుల‌ అరెస్టు 

Hyderabad Police Arrest Robber

prophet row: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై ఆ పార్టీ చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హింస చెల‌రేగింది. దీంతో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో పాల్గొన్న వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తున్నారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ఆదివారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు మొత్తం 304 మంది నిందితుల‌ను అరెస్టు చేశామని ఏడీజీ (శాంతి, భ‌ద్ర‌త‌లు) ప్ర‌శాంత్ కుమార్ చెప్పారు. ప్ర‌యాగ్ రాజ్‌లో 91, స‌హార‌న్ పూర్‌లో 71, హాథ్రస్‌లో 51, మోరాదాబాద్‌లో 34, ఫెరోజాబాద్‌లో 15, అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో 34 మందిని అరెస్టు చేసిన‌ట్లు వివ‌రించారు. మొత్తం 13 ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు. శుక్ర‌వారం మ‌సీదుల్లో ప్రార్థ‌న త‌ర్వాత వారంతా ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల‌ను గుర్తిస్తున్నారు. కాగా, ఆయా ప్రాంతాల్లో మ‌రోసారి అల్ల‌ర్లు చెల‌రేగ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు.