Facebook Profiles : ఒకే ఫేస్‌బుక్ అకౌంట్‌.. మల్టీ ప్రొఫైల్ ప్రైవసీ అకౌంట్లను క్రియేట్ చేయొచ్చు..!

మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మీ ప్రొఫెషనల్ సర్కిల్‌కి తెలియకూడదని అనుకుంటున్నారా?

Facebook Profiles : ఒకే ఫేస్‌బుక్ అకౌంట్‌.. మల్టీ ప్రొఫైల్ ప్రైవసీ అకౌంట్లను క్రియేట్ చేయొచ్చు..!

Facebook Will Soon Allow Users To Create Multiple Profiles

Facebook Profiles : మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మీ ప్రొఫెషనల్ సర్కిల్‌కి తెలియకూడదని అనుకుంటున్నారా? అయితే మీ ఒకే ఫేస్ బుక్ అకౌంటు ద్వారా ఐదు వేర్వేరు ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకు సోషల్ మీడియా దిగ్గజం త్వరలో మిమ్మల్ని అనుమతించనుంది. ఫేస్‌బుక్ ప్రస్తుతం తన ప్లాట్‌ఫారమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. యూజర్లు వివిధ గ్రూప్‌లకు వేర్వేరు ప్రొఫైల్స్ ద్వారా సులభంగా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్‌ను అనుమతిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదాహరణకు.. మీరు మీ సహోద్యోగులకు ఒక ప్రొఫైల్‌ను, మీ స్నేహితుల కోసం మరొక ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో యూజర్లు ఇప్పటికీ మల్టీ అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే వారు ప్రతి అకౌంట్‌కు వేర్వేరు IDలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితులు మారనున్నాయి.

యూజర్లు తమ ఆసక్తులు, సంబంధాల ఆధారంగా వారి అనుభవాన్ని పొందేందుకు ఒకే Facebook అకౌంటుతో ఒకటి కంటే ఎక్కువ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. Facebook ఉపయోగించే ఎవరైనా తప్పనిసరిగా తమ నిబంధనలను అనుసరించాలని ఫేస్‌బుక్ ప్రతినిధి లియోనార్డ్ లామ్ టెక్ క్రంచ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. TechCrunch నివేదిక ప్రకారం.. అదనపు ప్రొఫైల్స్ ద్వారా ఒక యూజర్ తన అసలు పేరును వాడాల్సిన అవసరం లేదు. ఫేస్ బుక్ యూజర్ తన ప్రైమరీ అకౌంట్ మినహా.. ఇతర ఏదైనా ప్రొఫైల్ పేర్లు లేదా యూజర్ పేర్లను ఉపయోగించవచ్చు. వినియోగదారులు స్థానంలో సంఖ్యలు లేదా స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించకూడదు. యూజర్ల ప్రధాన ప్రొఫైల్‌లు ఇప్పటికీ నిత్య జీవితంలో ఉపయోగించే పేరునే ఉపయోగించాలని Facebook చెబుతోంది.

Facebook Will Soon Allow Users To Create Multiple Profiles (1)

Facebook Will Soon Allow Users To Create Multiple Profiles 

వినియోగదారు సృష్టించే అన్ని అదనపు ప్రొఫైల్‌లకు సెక్యూరిటీ, ప్రైవసీ నిబంధనలు ఎక్కువ లేదా తక్కువ ఒకే విధంగా ఉంటాయని Facebook తెలిపింది. అదనపు ప్రొఫైల్‌లు కూడా Facebook విధానాలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. ప్రొఫైల్‌లు మీ గుర్తింపును తప్పుగా సూచించడం లేదా ఇతరులకు మాదరిగా ఉంచడం సాధ్యం కాదని Facebook పేర్కొంది. మీ ప్రొఫైల్‌లు ఏవీ ఉల్లంఘన రాకూడదు. ఎందుకంటే అప్పుడు మీ మొత్తం ప్రొఫైల్ ఎఫెక్ట్ అవుతుంది. అదనపు ప్రొఫైల్‌లు ఇప్పటికీ దాని విధానాలకు లోబడి ఉన్నాయని, మీ గుర్తింపును తప్పుగా సూచించలేవని కంపెనీ చెబుతోంది.

మీరు అదనపు ప్రొఫైల్‌లో ఉల్లంఘనను స్వీకరిస్తే.. అది మీ అకౌంటుపై ప్రభావం చూపుతుంది. యూజర్లు తమ ఫీచర్లను దుర్వినియోగం చేయకుండా లేదా వారి అదనపు ప్రొఫైల్‌లను ఉపయోగించి నిలిపివేస్తామని సోషల్ మీడియా సంస్థ తెలిపింది. ఫేస్‌బుక్ సిస్టమ్ అదనపు ప్రొఫైల్‌తో పాటు లింక్ చేసిన అకౌంట్ గుర్తించి, అదనపు ప్రొఫైల్ లేదా అన్ని ప్రొఫైల్‌లను తొలగించడం వంటి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో యూజర్లు తమ మెయిన్ అకౌంట్ యాక్సెస్‌ను కూడా కోల్పోవచ్చు.

Read Also : Facebook : ఫేస్‌బుక్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!