Sai Pallavi : సాయి పల్లవి ‘నో’ చెప్పిన సినిమాలు ఇవే..!
. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లలో మరో నటిని ఊహించుకోలేం అనేంతగా అలరించింది సాయి పల్లవి.. కాంబినేషన్ కంటే కూడా కథ, క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే సాయి పల్లవి కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసింది.. అవేంటో తెలుసా..?

Films Rejected By Actress Sai Pallavi
Sai Pallavi: సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీ.. టాలెంటెడ్ యాక్ట్రెస్.. బ్యూటిఫుల్ డ్యాన్సర్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.. మలయాళం ‘ప్రేమమ్’ లో మలార్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సాయి పల్లవి ‘ఫిదా’ తో తెలుగు వారిని ఆకట్టుకుంది..
ధనుష్ ‘మారి 2’ లో ‘రౌడీ బేబీ’ సాంగ్‌తో సెన్సేషన్ క్రయేట్ చేసింది.. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లలో మరో నటిని ఊహించుకోలేం అనేంతగా అలరించింది సాయి పల్లవి.. కాంబినేషన్ కంటే కూడా కథ, క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే సాయి పల్లవి కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసింది.. అవేంటో తెలుసా..?
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం, కార్తితో తీసిన ‘చెలియా’ మూవీలో సాయి పల్లవిని కథానాయికగా అనుకున్నారు కానీ కుదరలేదు.. తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ లో హీరోయిన్ ఆఫర్ వచ్చినా నో చెప్పేసింది.. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ రెండు సినిమాల్లోనూ రష్మికనే కథానాయికగా తీసుకోవడం విశేషం..
యువసామ్రాట్ నాగ చైతన్యతో నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీ రిలీజ్‌కి రెడీ అవగా.. రానాతో ‘విరాట పర్వం’, నేచురల్ స్టార్ నాని పక్కన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్లో నటిస్తోంది బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి..