Tamilnadu: 20 ఏళ్లుగా ఆటో డ్రైవర్.. ఇప్పుడు అక్కడ తొలి మేయర్
డు దశాబ్దాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్న కే శరవణన్ తొలి సిటీ మేయర్ అయిపోయాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంబకోణం కార్పొరేషన్ లో మేయర్ గా

City Mayor
Tamilnadu: రెండు దశాబ్దాలుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్న కే శరవణన్ తొలి సిటీ మేయర్ అయిపోయాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంబకోణం కార్పొరేషన్ లో మేయర్ గా బాధ్యతలు అందుకున్నాడు. మేయర్ అయినప్పటికీ తాను చేసిన పని మర్చిపోకుండా ఆటో నడుపుకుంటూ ప్రమాణ స్వీకారానికి విచ్చేశాడు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నుంచి 21కార్పొరేషన్లకు గానూ 20 మంది అభ్యర్థులను కేటాయించింది. ఒక సీటును మేయర్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ కు విడిచి పెట్టింది. అంతటి డిమాండ్ ఉన్న పోస్టు కోసం పలువురు సీనియర్ నేతలు ఎదురుచూసినప్పటికీ మేయర్ పగ్గాలను శరవణన్ కే అప్పగించింది కాంగ్రెస్.
రీసెంట్ గా కార్పొరేషన్ గా మారిన కుంభకోణానికి తొలి మేయర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. 17వ వార్డులో జరిగిన ఎన్నికల్లో 2వేల 100 ఓట్లకు గానూ 964దక్కించుకుని విజేతగా నిలిచాడు శరవణన్.
Read Also : చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ..28 ఏళ్ల ప్రియ రికార్డు
పలువురు కాంగ్రెస్ లీడర్లు ట్విట్టర్ ద్వారా శరవణన్ ను అభినందిస్తూ.. పార్టీ లీడర్ షిప్ అభ్యర్థి ఎంపిక చేసిన తీరును ప్రశంసిస్తున్నారు.
‘తంజావూరు నార్త్ కాంగ్రెస్ కమిటీ జిల్లా లీడర్ అయిన టీఆర్ లోగనాథన్ జిల్లా ఆఫీసుకు రమ్మని నీకో సర్‌ప్రైజ్ ఉందని చెప్పారు. అప్పటివరకూ నాకేం తెలియదు. ఆఫీసుకు వెళ్లగానే ఒక్క సారిగా అరుస్తూ.. వెల్‌కమ్ ఫస్ట్ మేయర్ అంటూ అభినందనలు తెలిపారు. నేను షాక్ అయ్యా. ఇది నేనెప్పుడూ ఊహించనిది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే వాళ్లలో నాకంటే సీనియర్లు పోటీలో ఉన్నారు’
‘నేను కేవలం ఆటో డ్రైవర్ మాత్రమేనని చెప్పా. కానీ, మా లీడర్ మేయర్ అవడానికి అన్ని లక్షణాలు నాలో ఉన్నాయంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మా రాష్ట్ర ప్రెసిడెంట్ కేఎస్ ఆలగిరి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. సీఎం స్టాలిన్ నుంచి ఫోన్ వచ్చింది. నిజంగానే ఆటోనడిపి మనుగడ సాగిస్తున్నావా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం చెప్పా. ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ అవకాశాన్ని కల్పించారు. కుంభకోణాన్ని రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కంటే బెస్ట్ గా చేసి చూపిస్తానని చెప్పా. నా నామినేషన్ కే మా నాయకులు రాహుల్ గాంధీ చాలా హ్యాపీగా ఫీలయ్యారు’ అని వివరించారు శరవణన్.
పదో తరగతి వరకూ మాత్రమే చదివిన శరవణన్.. పేరెంట్స్ అతని తక్కువ వయస్సులోనే దూరమయ్యారు. అప్పటి నుంచి కుంభకోణం మునిసిపాలిటీ సభ్యుడైన తాత కుమారసామి వద్దనే పెరిగాడు. అతణ్ని ఆదర్శంగా తీసుకునే 2002లో కాంగ్రెస్ లో జాయిన్ అయి వార్డ్ లీడర్ గా పోటీ చేశాడు. ఆ తర్వాత మునిసిపాలిటీలో పార్టీ డిప్యూటీ లీడర్ గా గెలిచాడు..
Read Also : దేశంలోనే అత్యంత చిన్నవయసు గల మేయర్,ఎమ్మెల్యేల వివాహం
‘నా తాత కూడా చేతి గుర్తుపైనే గెలిచారు. నేను కూడా అదే మోయాలని అనుకున్నా. నాకు 22ఏళ్లున్నప్పుడు తంజావూరు నార్త్ కాంగ్రెస్ కమిటీ నాయుడ్ని కలిసి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పా. అప్పటి నుంచి పార్టీలోనే ఉండి ఎన్నికల పనుల్లో పాల్గొనే వాడిని. కొన్ని ఆందోళనల్లో అరెస్ట్ అయ్యాను కూడా. అప్పుడే లోగనాథన్ నన్ను ఖాళీ సమయాల్లో పార్టీ ఆఫీసుకు రమ్మని పార్టీ క్యాడర్ లో, సీనియర్ లీడర్ల దగ్గర, సాధారణ మనుషుల దగ్గర ఎలా మాట్లాడాలో చెప్పేవారు’ అంటూ వివరించారు.
భార్య దేవీతో పాటు ముగ్గురు పిల్లలతో శరవణన్ అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండేవాడు. కుంభకోణంలో ప్రతి మూల, 48వార్డుల్లో అన్ని ప్రదేశాలు తనకు తెలుసని చెప్తున్నాడు. ఏడేళ్ల క్రితం కుటుంబ పోషణ కోసం ఆటో కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు.