Sounds Inside Temple : గుడిలో గజ్జల శబ్దం.. ఆలయంలో అంతుచిక్కని మిస్టరీ.. అసలేం జరుగుతోంది?

పార్వతీపురం మన్యం జిల్లాలో గుడిలో గజ్జల శబ్దాలు కలకలం రేపుతున్నాయి. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ గుడి నుంచి గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి స్థానికులు చెబుతున్నారు. ఆ గజ్జల శబ్దాలు వినేందుకు పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. ఆలయం గోడలకు చెవులను పెట్టి శబ్దాలను వింటున్నారు.

Sounds Inside Temple : గుడిలో గజ్జల శబ్దం.. ఆలయంలో అంతుచిక్కని మిస్టరీ.. అసలేం జరుగుతోంది?

Updated On : August 9, 2022 / 12:06 AM IST

Sounds Inside Temple : పార్వతీపురం మన్యం జిల్లాలో గుడిలో గజ్జల శబ్దాలు కలకలం రేపుతున్నాయి. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ గుడి నుంచి గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి స్థానికులు చెబుతున్నారు. ఆ గజ్జల శబ్దాలు వినేందుకు పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. ఆలయం గోడలకు చెవులను పెట్టి శబ్దాలను వింటున్నారు.

నిజంగానే గజ్జల శబ్దం వినిపిస్తోందని చెబుతున్నారు. రోజూలాగే సోమవారం సాయంత్రం పూజా కార్యక్రమాల తర్వాత ఆయల పూజారి గుడి మూసివేసి వెళ్లారు. అయితే, ఆ తర్వాత గుడిలో నుంచి పెద్దగా గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకింది. చుట్టుపక్కల గ్రామాల వారికీ తెలిసింది. దీంతో గజ్జల శబ్దాలు వినేందుకు జనాలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

గుడి లోపం నుంచి వస్తున్న శబ్దాలు విని స్థానికులు షాక్ అవుతున్నారు. కొందరు ఆందోళన చెందుతున్నారు. అసలు గుడి లోపల నుంచి శబ్దాలు ఎందుకొస్తున్నాయి? కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.