Sridevi Soda Center : లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు..

సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా.. ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’..

Sridevi Soda Center : లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు..

Sridevi Soda Center

Updated On : May 11, 2021 / 12:14 PM IST

Sridevi Soda Center: సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా.. ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’.. ‘భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర’ విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవి‌రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు..

ఫస్ట్ మూవీ ‘ప‌లాస 1978’ తో సినిమా వర్గాలవారిని, ప్రేక్షకులను ఆకట్టుకున్న క‌రుణ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మంగళవారం సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ.. ‘లైటింగ్ ఆఫ్ సూరిబాబు’ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు. సుధీర్ సరికొత్త మేకోవర్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ సినిమాలో సుధీర్ లైటింగ్ సూరిబాబుగా కనిపించనున్నాడు.. హీరోయిన్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాకి కెమెరా : శ్యామ్‌దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనింగ్ : రామకృష్ణ-మోనిక.