‘నారప్ప’ గా వెంకటేష్.. చాలా రోజుల తర్వాత మాస్ క్యారెక్టర్‌లో..

‘నారప్ప’ గా వెంకటేష్.. చాలా రోజుల తర్వాత మాస్ క్యారెక్టర్‌లో..

Updated On : January 17, 2021 / 7:12 PM IST

Narappa Glimpse: విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్‌అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ప్రొడక్షన్స్‌ప్రై.లి, వి క్రియేషన్స్‌పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’.. తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ మూవీకిది అఫీషియల్ రీమేక్‌..

డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘నారప్ప’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. వెంకీ సరికొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాంచి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని గ్లింప్స్ చూస్తూ అర్థమవుతోంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ అనేలా ఉంది.

సినిమాటోగ్రఫీ: శామ్‌.కె నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌హెయిన్స్‌, విజయ్‌, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం..