Gujarat former CM Meets CM KCR : సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు.

Gujarat former cm shankar singh vaghela meets cm kcr in hyderabad
Gujarat former cm shankar singh vaghela meets cm kcr : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్ కు వచ్చిన వాఘేలా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరిరువురూ జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమయ్యారు. ఈక్రమంలో గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా ఇటీవలనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ సింగ్ వాఘేలా తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని శంకర్ సింగ్ వాఘేలా ప్రకటించారు.
బీజేపీపై తీవ్ర విమర్శలు సంధిస్తున్న కేసీఆర్ ఇప్పటికే పలువురు జాతీయ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ యేతర ప్రభుత్వం రావాలని సంకల్పించారు. దీంట్లో భాగంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ..దీనికోసం కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల కాలంలో నొక్కి చెబుతున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. గతంలోనే బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు
గత ఆదివారం నాడు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైద్రాబాద్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత కుమారస్వామి మాట్లాడుతూ దసరా లోపుగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కుమారస్వామి ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈక్రమంలో కేసీఆర్ మూడేళ్ల తరువాత విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేసీఆర్ కు కూడ సీపీఐ నేతలు ఆహ్వనం పలికారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు పార్టీల నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగానే గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలాతో కేసీఆర్ ఇవాళ చర్చించారు.