Koratala Siva : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాన్ని జోడించి.. తెలుగు తెరపై హీరోయిజం లెక్కల్ని మార్చిన రైటర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు (జూన్ 15)..

Koratala Siva : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

Happy Birthday To Blockbuster Director Koratala Siva

Updated On : June 15, 2021 / 12:03 PM IST

Koratala Siva: ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తూ.. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాన్ని జోడించి తెలుగు తెరపై హీరోయిజం లెక్కల్ని మార్చిన రైటర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు (జూన్ 15)..

కథ ఎంత బాగా రాస్తారో దాన్ని అంతే బాగా తెరకెక్కిస్తారు కొరటాల. తనకేం కావాలో అది టెక్నీషియన్లతో చేయించుకోవడం, నాకు రాయడం, మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్పడం మాత్రమే తెలుసు. మిగతాదంతా సాంకేతికనిపుణుల పనితమేనంటూ వారికి రెస్పెక్ట్ ఇవ్వడం కొరటాల గొప్పదనం.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ప్రెస్టీజియస్ ఫిలిం ‘ఆచార్య’ చేస్తున్నారు. షూటింగ్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నారు. తారక్, రామ్ చరణ్‌లతో పాటు సినిమా ఇండస్ట్రీ వారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొరటాల శివకు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.